జనవరి 17, 2018
ఆర్బీఐ పునరుద్ఘాటన - వివిధ డిజైన్లతో కూడిన ₹ 10 నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు (లీగల్ టెండర్) అవుతాయి చెల్లుబాటు కావనే అపోహతో కొన్ని ప్రదేశాలలో కొందరు వ్యాపారులు మరియు ప్రజలు, ₹ 10 నాణేలు తీసుకోవడం లేదన్న విషయం రిజర్వు బ్యాంక్ వారి దృష్టికి వచ్చింది.
ప్రభుత్వ ముద్రణా సంస్థలు (మింట్‌లు) ముద్రించిన నాణేలను (కాయిన్లు) రిజర్వు బ్యాంక్ చెలామణిలోకి తెచ్చిందని స్పష్టంచేస్తున్నాము. ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక విలువలను ప్రతిబింబించే ఇతివృత్తాలతో విలక్షమైన ఫీచర్లను కలిగి ఉన్న ఈ నాణేలను, ఎప్పటికప్పుడు చలామణిలోకి తీసుకురావడం జరిగింది.
నాణేలు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండటం మూలాన, ఒకే సమయంలో వివిధ డిజైన్లలో మరియు ఆకృతిలలో ఈ నాణేలు మార్కెట్లో చట్టబద్ధంగా చలామణీలో ఉన్నాయి. ఇప్పటివరకు, రిజర్వ్ బ్యాంకు ఈ ₹ 10 నాణేలను 14 రకాల డిజైన్లతో జారీ చేసింది మరియు ప్రజలకు ఈ నాణేల విలక్షమైన ఫీచర్లను పత్రికా ప్రకటనల (జాబితా అనుబంధం చేయబడింది) ద్వారా తెలియజేయటం జరిగింది. ఈ నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయి మరియు లావాదేవీల సందర్భంగా వీటిని అంగీకరించాలి.
ఇంతకుముందు కూడా రిజర్వ్ బ్యాంకు నవంబర్ 20, 2016 తారీఖు నాటి తమ పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు ₹ 10 నాణేలపై అనుమానం అవసరంలేదని, విభిన్న రకాల డిజైన్లతో కూడిన ఈ నాణేలు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని మరియు వారి లావాదేవీల కోసం ఈ నాణేలను అంగీకరించాలని స్పష్టం చేశారు.
బ్యాంకుల బ్రాంచిలన్నింటిలోనూ ఈ నాణేలను లావాదేవీలు మరియు ఎక్స్ఛేంజ్ కోసం అంగీకరించాలని, రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు కూడా సలహా ఇచ్చింది.
ఈ నాణేల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి ఈ క్రింది లింక్ ను సందర్శించండి: https://www.rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx
| క్రమ సంఖ్య |
జారీ తేదీ |
పత్రికా ప్రకటనలు (ప్రెస్ రిలీజ్ లు) |
| 1. |
జూన్ 29, 2017 |
శ్రీమద్ రాజ్ చంద్ర 150 వ జన్మదిన వార్షికోత్సవ స్మారక సందర్భంగా ₹ 10 నాణేల జారీ |
| 2. |
ఏప్రిల్ 26, 2017 |
నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (National Archieves of India) నూట ఇరవై ఐదవ సంవత్సర స్మారక సందర్భంగా ₹ 10 నాణేల జారీ |
| 3. |
జూన్ 22, 2016 |
రిజర్వ్ బ్యాంక్ త్వరలో స్వామి చిన్మయానంద శతజయంతిని పురస్కరించుకొని, ₹ 10 నాణేలు చెలామణిలోకి తేబొతున్నది |
| 4. |
జనవరి 28, 2016 |
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125 వ జన్మదిన వార్షికోత్సవ స్మారక సందర్భంగా ₹ 10 నాణేలు జారీ |
| 5. |
జులై 30, 2015 |
అంతర్జాతీయ యోగాదినమ్ పురస్కరించుకొని ₹ 10 నాణేలు జారీ |
| 6. |
ఏప్రిల్ 16, 2015 |
దక్షిణాఫ్రికా నుంచి మహాత్మాగాంధీ తిరిగివచ్చి నూరువత్సరాలైన స్మారకోత్సవం సందర్భంగా ₹ 10 నాణేల జారీ |
| 7. |
జులై 17, 2014 |
కాయర్ బోర్డు వజ్రోత్సవం (Diamond Jubilee of Coir Board) స్మారక సందర్భంగా ₹ 10 నాణేలు జారీ |
| 8. |
ఆగష్టు 29, 2013 |
శ్రీమాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం (ష్రైన్) బోర్డు రజతోత్సవ స్మారక సందర్భంగా ₹ 10 నాణేలు జారీ |
| 9. |
జూన్ 14, 2012 |
భారత పార్లమెంటు షష్టిపూర్తి (60 సంవత్సరాలైన) స్మారక సందర్భంగా నాణేలు జారీ |
| 10. |
జులై 22, 2011 |
కొత్త క్రమం (న్యూ సిరీస్) లో నాణేల జారీ |
| 11. |
ఏప్రిల్ 01, 2010 |
ఆర్.బీ.ఐ ఎట్ 75 (RBI at 75): ప్రధానమంత్రి చే స్మారక నాణేల సెట్; ఆర్థిక మంత్రి చే ‘మింట్ రోడ్ మైల్స్టోన్స్’ ల విడుదల |
| 12. |
ఫిబ్రవరి 11, 2010 |
హోమీబాబా శతజయంతి సంవత్సర సందర్భంగా క్రొత్త ₹ 10 ద్విలోహాత్మక (బై-మెటాలిక్) స్మారక చలామణి నాణేo జారీ |
| 13. |
మార్చ్ 26, 2009 |
‘భిన్నత్వంలో ఏకత్వం” (యూనిటీ ఇన్ డైవర్సిటి) ఇతివృత్తంతో కొత్త ₹ 10 ద్విలోహాత్మక (బై-మెటాలిక్) నాణేలు |
| 14. |
మార్చ్ 26, 2009 |
‘సంధాయకత మరియు సమాచార సాంకేతికరంగం’ (Connectivity and Information Technology) ఇతివృత్తం తో కొత్త ₹ 10 ద్విలోహాత్మక (బై-మెటాలిక్) నాణేలు |
జోస్ జె.కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్
ప్రెస్ రిలీజ్: 2017-2018/1950
|