తేదీ: 24/01/2018
నవోదయ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నాగ్‌పూర్, మహారాష్ట్రకు
రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన ఆదేశాలు జులై 15, 2018 వరకు పొడిగింపు నవోదయ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు, రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన ఆదేశాలు మరొక ఆరు నెలలు పొడిగించబడ్డాయి. ఈ ఆదేశాలు ఇప్పుడు జులై 15, 2018 వరకు (సమీక్షకులోబడి) అమలులో ఉంటాయి.
సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35A, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) తమకు దఖలుపరచబడ్డ అధికారాలతో ఈ ఆదేశాలు జారీచేయబడ్డాయి. ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకొరకు, నవోదయ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు ఆవరణలో ప్రదర్శించబడినది.
రిజర్వ్ బ్యాంక్ ఈ ఆదేశాలు జారీచేసినంత మాత్రాన, బ్యాంకుయొక్క అనుమతి రద్దుచేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో, బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటుంది. పరిస్థితులకు అనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, ఈ ఆదేశాలలో మార్పులుచేయవచ్చు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/2028 |