భారత ప్రభుత్వం, డా. ప్రసన్న కుమార్ మొహంతి మరియు శ్రీ దిలీప్ ఎస్ సంఘ్విలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ బోర్డ్‌లో నిర్దేశకులుగా నియమించినది. |
తేదీ: 01/02/2018
భారత ప్రభుత్వం, డా. ప్రసన్న కుమార్ మొహంతి మరియు
శ్రీ దిలీప్ ఎస్ సంఘ్విలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్
కేంద్రీయ బోర్డ్‌లో నిర్దేశకులుగా నియమించినది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, క్లాజ్ (b) సబ్-సెక్షన్ (1) సెక్షన్ 8 క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, కేంద్ర ప్రభుత్వం, డా. ప్రసన్న కుమార్ మొహంతి (ఫిబ్రవరి 08, 2021 వరకు) మరియు శ్రీ దిలీప్ ఎస్ సంఘ్విలను (మార్చ్ 10, 2021 వరకు) భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ బోర్డ్‌లో నిర్దేశకులుగా నియమించినది. వీరి నియామకం వరుసగా ఫిబ్రవరి 08, 2021 మరియు మార్చ్ 10, 2021 వరకు, లేదా తిరిగి ఆదేశాలు జారీచేసేవరకు (మొదట సంభవించిన తేదీవరకు) కొనసాగుతుంది.
జోస్ జె కత్తూర్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/2096
|
|