మార్చ్ 07, 2018
భారతీయ స్టేట్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా జారీచేయబడిన ‘నకిలీ నోట్ల గుర్తింపు మరియు స్వాధీనత’ నిబంధనల మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, భారతీయ రిజర్వు బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంకు ఫై మార్చ్ 01, 2018 న 4 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరీమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47A(1)(c) తో కలిపి, సెక్షన్ 46(4)(1) లోని అధికారాలను వినియోగించుకొని, పైన ఉదహరించిన మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, విధించడం జరిగింది.
ఈ చర్య, మార్గదర్శకాలను/ఆదేశాలను బ్యాంకు పాటించనందుకు మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉండదు.
నేపథ్యం
బ్యాంకు యొక్క కరెన్సీ చెస్ట్ తనిఖీలో, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా జారీచేయబడిన ‘నకిలీ నోట్ల గుర్తింపు మరియు స్వాధీనత’ నిబంధనల మార్గదర్శకాలను/ఆదేశాలను పాటించడంలో ఉల్లంఘన జరిగినట్లు వెల్లడైంది. తనిఖీ నివేదిక/దస్తావేజుల ఆధారంగా, ఆర్.బి.ఐ ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరీమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు జారీ చేయడం జరిగింది.
బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం, వ్యక్తిగత విచారణలో మౌఖిక నివేదనలను పరిగణించిన అనంతరం, ఆర్.బి.ఐ ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో బ్యాంకు విఫలమైనదన్న ఆరోపణలు వాస్తవమని నమ్ముతూ, జరీమానా విధించాలని నిర్ధారణకు రావడం జరిగింది.
జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/2385
|