తేదీ:15/05/2018
ది వ్రిద్ధాచలం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ (నం. E 81), 64, సౌత్ ఫోర్ట్ స్ట్రీట్,
వ్రిద్ధాచలం 606001 పై ఆర్బీఐ జరిమానా విధింపు.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 సెక్షన్ 47A(1) (b) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం,భారతీయ రిజర్వ్ బ్యాంక్ తమకు దఖలుపరచబడిన ఆధికారాలతోది వ్రిద్ధాచలం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్,(నం.E 81), 64, సౌత్ ఫోర్ట్ స్ట్రీట్, వ్రిద్ధాచలం 606001 పై ₹ 2.00 లక్షల (రెండు లక్షల రూపాయలు) నగదు జరిమానా విధించింది.జూలై 1, 2013 తేదీ నాటి మాస్టర్ సర్కులర్ UBD.CO.BPD.MC.No.8/12.05.001/2013-14 పేరా 5 ప్రకారం, డైరెక్టర్స్ మరియు వారి బంధువులకు లోన్స్ మరియు అడ్వాన్సుల పొడిగింపును నిషేధిస్తూరిజర్వు బ్యాంకు వారుజారీ చేసిన ఆదేశాలను బ్యాంక్ ఉల్లంఘించినందులకు, ఈ జరిమానా విధించడం జరిగింది.
2. రిజర్వు బ్యాంక్ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినది. ఈ సందర్భంగా నిజానిజాలు మరియుబ్యాంక్ ఇచ్చిన సమాధానమునుపరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వు బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/2998 |