Download
the telugu
font
 
   మా గురించి     ఉపయోగకరమైన సమాచారం     తరచూ అడిగే ప్రశ్నలు     త.అ.ప్ర.లు  ఆర్ధిక విజ్ఞానము     ఫిర్యాదులు       ఇతర లింకులు 
x¤¦Ü[ª±sV >> ú|ms£qs LjiÖdÁÛÇÁ£qs - Display
Note : To obtain an aligned printout please download the (97.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 16/05/2018
యునైటెడ్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, బాగ్నన్, స్టేషన్ రోడ్ (నార్త్), పోస్ట్-బాగ్నన్, జిల్లా-హౌరా, పశ్చిమ బెంగాల్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది

తేదీ: 16/05/2018

యునైటెడ్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, బాగ్నన్, స్టేషన్ రోడ్ (నార్త్), పోస్ట్-బాగ్నన్,
జిల్లా-హౌరా, పశ్చిమ బెంగాల్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది

క్రింద ఉదహరించిన ఆదేశాలు మరియు, మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధానంగా) లోని సెక్షన్ 46(2)&(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(a)&(c) లోని అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు, యునైటెడ్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, బాగ్నన్, స్టేషన్ రోడ్ (నార్త్), పోస్ట్-బాగ్నన్, జిల్లా-హౌరా, పశ్చిమ బెంగాల్ ఫై రూ.5.00 లక్షలు (ఐదు లక్షల రూపాయలు) జరిమానా విధించింది.

ఎ. కార్యాచరణ క్షేత్రం, బ్రాంచ్ ఆథరైజేషన్ పాలసీ, ఎక్స్టెన్షన్ కౌంటర్ల ప్రారంభం మరియు వాటి మెరుగుదల, వృద్ధి, ఎటిఎంలు మరియు కార్యాలయాల విభజన/ తరలించడం/మూసివేయడం ఫై భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క జూలై 1, 2015 తేదీ నాటి మాస్టర్ సర్కులర్ ఆదేశాలు మరియు, మార్గదర్శకాల ఉల్లంఘన;

బి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 (AACS) యొక్క సెక్షన్ 35 (2) ఉల్లంఘన.

మార్చి 31, 2016 నాటి బ్యాంక్ తనిఖీ ఫలితాల ఆధారంగా, భారతీయ రిజర్వు బ్యాంకు, బ్యాంకుకు జారీచేసిన షో- కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంకు, ఆర్బిఐ, కోల్కతా ప్రాంతీయ డైరెక్టర్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీకి లిఖిత పూర్వకంగా మరియు వ్యక్తిగతంగా సమాధానాన్ని సమర్పించింది. ఈ కేసులోని వాస్తవాలను, బ్యాంకు ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంపై భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను పాటించడంలో బ్యాంకు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి జరిమానా విధించాలని నిర్ణయించడం జరిగింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/3013

 
  © x¤¦¦¦NRPVäÌÁV ˳ØLRi¼d½¸R…V LjiÇÁLRiV* ËØùLiNRPV ª yLjiZNP[ ¿ÁLiµj…ª«soƒyõLiVV.

1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTPsVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….