తేదీ: 18/05/2018
సౌత్ ఇండియన్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా ‘ఆదాయం గుర్తింపు మరియు ఆస్తి వర్గీకరణ’ (IRAC), ‘మీ వినియోగదారుని తెలుసుకోండి’ (KYC), ట్రెజరీ కార్యకలాపాలు మరియు ఆదేశాల పాలన లోపాలు కోసం జారీ చేసిన నిబంధనలు / ఆదేశాలు పాటించనందుకు, భారతీయ రిజర్వు బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు లిమిటెడ్ ఫై మే 14, 2018 నాటి ఆదేశం ప్రకారం, రూ.50 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47A(1)(c) తో కలిపి, సెక్షన్ 46(4)(i) లోని అధికారాలను వినియోగించుకొని, పైన ఉదహరించిన భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు విధించడం జరిగింది.
ఈ చర్య, మార్గదర్శకాలను/ఆదేశాలను బ్యాంకు పాటించనందుకు మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉండదు.
జోస్ J. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/3038 |