May 25, 2018
భారతీయ రిజర్వు బ్యాంకు 2 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్ బి ఎఫ్ సి)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది రెండు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
జారీ చేయబడిన తేదీ |
రద్దు చేయబడిన తేదీ |
1 |
M/s జె కె ట్రాన్స్పోర్టార్స్ మరియు ఫైనాన్సియర్స్ (ప్రై) లిమిటెడ్ |
గురుద్వారా భవనం, అమీరా కడాల్, శ్రీనగర్-190001 |
B-1100046 |
మే 30, 2001 |
మే 02, 2018 |
2 |
M/s జె కె క్రెడిట్ మరియు ఇన్వెస్ట్మెంట్ (ప్రై) లిమిటెడ్ (గతంలో M/s హెల్పేజ్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్) |
హాల్ నం 103, నార్త్ బ్లాక్, బాహు ప్లాజా, రైల్ హెడ్ కాంప్లెక్స్, జమ్ము-
180 012 |
B-1100059 |
నవంబర్ 27, 2001 |
మే 02, 2018 |
అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (ఎ) లో నిర్వచించిన విధంగా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క వ్యాపారాన్ని చేయకూడదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2017-2018/3089 |