June 05, 2018
అభ్యుదయ మహిళా పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్., చెన్నపట్న, కర్ణాటక ఫై జరిమానా
అభ్యుదయ మహిళా పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్., చెన్నపట్న, కర్ణాటక ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 100,000/- (లక్ష రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. ఏప్రిల్ 29, 2003 తేదీ నాటి భారతీయ రిజర్వు బ్యాంకు సర్కులర్ సంఖ్య BPD 50/13.05.00/2002-03 లో నిర్దేశించిన సంచాలకులు (డైరెక్టర్లు) /వారి బంధువులకు మరియు ఫర్మ్స్/సంస్థలకు రుణాలు ఇవ్వడంలో మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధానంగా) లోని సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఫై జరిమానా విధించడం జరిగింది.
భారతీయ రిజర్వు బ్యాంకు, బ్యాంకుకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ వ్యక్తిగత విచారణను అర్థించింది. ఈ కేసులోని వాస్తవాలను మరియు బ్యాంక్ నివేదన లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంపై, భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను పాటించడంలో బ్యాంకు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి జరిమానా విధించాలని నిర్ణయించడం జరిగింది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/3182 |