June 06, 2018
510 ఆర్మీ బేస్ వర్క్ షాప్ క్రెడిట్ కో-ఆపరేటివ్ ప్రైమరీ బ్యాంకు లిమిటెడ్.,
మీరట్ కంటోన్మెంట్ ఫై ఆర్బిఐ జరిమానా విధించింది.
510 ఆర్మీ బేస్ వర్క్ షాప్ క్రెడిట్ కో-ఆపరేటివ్ ప్రైమరీ బ్యాంకు లిమిటెడ్., మీరట్ కంటోన్మెంట్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 5,00,000/- (ఐదు లక్షల రూపాయల మాత్రమే) జరిమానా విధించింది. సరైన సమయంలో సరైన అనుపాలన సమర్పించడం, ఇంటర్-బ్యాంకు స్థూల ఎక్స్పోజర్ మరియు కౌంటర్ పార్టీ పరిమితిపై ప్రూడెన్షియల్ నార్మ్స్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (CICs) సభ్యత్వాన్ని పొందడం, ఇన్వెస్ట్మెంట్ పోర్టుఫోలియో మరియు డిపాజిట్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన ఫండ్ (DEAF) యొక్క ఆడిట్ నిర్వహించడం మొదలగు వాటిలో భారతీయ రిజర్వు బ్యాంకు సూచనలు/మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధంగా) లోని సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఫై జరిమానా విధించడం జరిగింది.
భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా, బ్యాంకుకు జారీ చేసిన షో- కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించింది. ఈ కేసులోని వాస్తవాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంపై భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను పాటించడంలో బ్యాంకు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి, జరిమానా విధించాలని నిర్ణయించడం జరిగింది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/3186 |