February 16, 2018
పంజాబ్ నేషనల్ బ్యాంకు లో జరిగిన మోసం ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటన
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పి.ఎన్.బి) లో USD 1.77 బిలియన్ మోసం జరిగిన నేపథ్యంలో, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) పి ఎన్ బి ని ఇతర బ్యాంకులకు లెటర్ అఫ్ అండర్ టేకింగ్ (LOU) నిబద్ధతలను పాటించాలని ఆదేశించినట్లుగా మీడియాలో వచ్చింది. అటువంటి సూచనలు ఇవ్వనట్లు ఆర్బీఐ స్పష్టం చేస్తుంది.
పి.ఎన్.బి లో మోసం బ్యాంకు యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగుల నేరపూరితమైన ప్రవర్తన మరియు అంతర్గత నియంత్రణల వైఫల్యం మూలంగా కలిగిన కార్యాచరణ విపత్తు. పి ఎన్ బి లో నియంత్రణ వ్యవస్థల పర్యవేక్షణను ఆర్బీఐ ఇప్పటికే చేపట్టింది మరియు తదానుసారంగా తగిన పర్యవేక్షణ చర్య తీసుకుంటుంది.
జోస్ జె కట్టూర్ చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/2233
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….