| ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కార్యకలాపాలను ప్రారంభించింది |
February 22, 2018
ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కార్యకలాపాలను ప్రారంభించింది
ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫిబ్రవరి 22, 2018 నుండి ఒక చెల్లింపు బ్యాంకుగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 సెక్షన్ 22 (1) క్రింద ఈ బ్యాంకుకు ఇండియా లో చెల్లింపుల బ్యాంకు గా, భారతీయ రిజర్వు బ్యాంకు లైసెన్స్ జారీ చేసింది.
ఆగష్టు 19, 2015 న పత్రికా ప్రకటన లో ప్రకటించిన విధంగా, చెల్లింపుల బ్యాంకును ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం పొందిన 11 దరఖాస్తుదారులలో, ఆదిత్య బిర్లా నువో లిమిటెడ్, ముంబై, ఒకరు.
ఆశిష్ దర్యాని
అసిస్టెంట్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/2275 | |