December 06, 2017
అభివృద్ధి మరియు నియంత్రణ విధానాల పై ప్రకటన
వ్యాపారి తగ్గింపు ధర (మర్చంట్ డిస్కౌంట్ రేట్- ఎండిఆర్) యొక్క హేతుబద్ధీకరణ
1. ఇటీవలి కాలంలో, డెబిట్ కార్డు లావాదేవీలు 'పాయింట్ ఆఫ్ సేల్స్' వద్ద గణనీయమైన వృద్ధిని చూపించాయి. వ్యాపారుల విస్తృత నెట్ వర్క్ లలో వస్తువులను మరియు సేవలను కొనుగోలు చేయడానికి, డెబిట్ కార్డు చెల్లింపుల ఆమోదానికి మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి, వ్యాపారుల వర్గం ఆధారంగా డెబిట్ కార్డు లావాదేవీలకు వర్తించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) నియమాన్ని హేతుబద్దీకరించాలని నిర్ణయించబడింది. తేలిక-ఆస్తి అంగీకార మౌలిక సదుపాయాల కోసం ఒక విభిన్న ఎండిఆర్ మరియు ప్రతి లావాదేవీకి ఎండిఆర్ యొక్క ఖచ్చితమైన మొత్తాన్ని కూడా సూచించబడతాయి. సవరించిన ఎండిఆర్, డెబిట్ కార్డుల వినియోగాన్ని పెంచే లక్ష్యాల సాధనకు మరియు సంబంధిత సంస్థల వ్యాపార నిలకడ కోసం ఉద్దేశించబడినది. డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండిఆర్ కోసం సవరించిన సూచనలు నేడు జారీ చేయబడతాయి.
బాహ్య వాణిజ్య రుణాలకు (ఇసిబిలు-ECBs) రీఫైనాన్స్ చేయడానికి ఇండియన్ బ్యాంకుల విదేశీ బ్రాంచీలు / అనుబంధ సంస్థలను అనుమతించడం
2. ప్రస్తుతం భారతీయ కార్పోరేట్లు వారి ప్రస్తుత బాహ్య వాణిజ్య రుణాలను (ఇసిబిలు), అన్నీ కలిపిన తక్కువ ధర వద్ద తిరిగి చెల్లించటానికి అనుమతించబడతాయి. అయితే భారతీయ బ్యాంకుల విదేశీ శాఖలు/అనుబంధ సంస్థలు అటువంటి రీఫైనాన్స్ విస్తరించడానికి అనుమతించబడవు. అందరూ ఒకే స్థాయి పరిస్తుతుల్లో వ్యాపారం చేయడానికి, తాజాగా ECB లను పెంచడం ద్వారా, AAA రేటింగ్ కార్పొరేట్లు, నవరత్న మరియు మహారత్న PSU ల యొక్క ECB లను రీఫైనాన్స్ చేయడానికి భారత బ్యాంకుల విదేశీ బ్రాంచీలు/ అనుబంధాలను అనుమతించాలని, ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయించబడింది. ఈ విషయంలో, సవరించిన మార్గదర్శకాలు ఒక వారం లోపల జారీ చేయబడతాయి.
నివాసితులచే వస్తువు ధర రిస్క్ పైన హెడ్జింగ్ యొక్క వర్కింగ్ గ్రూప్ నివేదిక - అమలు
3. నివాసితులచే వస్తువు ధర రిస్క్ పై హెడ్జింగ్ యొక్క వర్కింగ్ గ్రూప్ నివేదిక (అధ్యక్షుడు: శ్రీ చందన్ సిన్హా), ప్రజా వ్యాఖ్యల కొరకు భారతీయ రిజర్వు బ్యాంకు వెబ్సైట్లో, నవంబర్ 16, 2017 న ఉంచబడింది. 'హెడ్జింగ్’ కొరకు అనుకూల జాబితా తయారుచేయడం, జాబితా 'హెడ్జింగ్’, ధర పరిమితి 'హెడ్జింగ్’ అలాగే విదేశీ వస్తువు ఉత్పన్నాలు (డెరివేటివ్స్) ఫలితంగా కరెన్సీ రిస్క్ యొక్క పరిమితిని సశక్త పరచడం, గ్రూప్ యొక్క ప్రధాన సిఫార్సులు. రిజర్వ్ బ్యాంక్ గ్రూప్ యొక్క సిఫార్సులు మరియు ప్రజా అభిప్రాయాన్ని పరిశీలిస్తుంది. సవరించిన ఆదేశాలతో సర్కులర్ జనవరి 15, 2018 నాటికి జారీ చేయబడుతుంది.
జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/1543 |