March 08, 2018
భిల్వారా మహిళా పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్., భిల్వారా (రాజస్థాన్)-
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (BR Act), 1949 (సహకార సొసైటీలకు వర్తించేది-AACS),
సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35ఎ క్రింద నిర్దేశం (డైరెక్షన్)
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (BR Act), 1949 (సహకార సొసైటీలకు వర్తించేది-AACS), సెక్షన్ 56 తో కలిపి సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని, భిల్వారా మహిళా పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్., భిల్వారా (రాజస్థాన్) ఫై, మార్చ్ 07, 2017 నాటి ఆదేశం ద్వారా మార్చ్ 09, 2017 నుండి 6 నెలల కాలానికి, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాలను (డైరెక్షన్) విధించింది. కాలానుసారంగా తదుపరి జారీచేయబడిన సెప్టెంబర్ 01, 2017 నాటి ఆదేశం ద్వారా మార్చ్ 09, 2018 వరకు మరియు మార్చ్ 01, 2018 ఆదేశం ద్వారా మార్చ్ 10, 2018 నుండి జులై 09, 2018 వరకు నిర్దేశాలు (డైరెక్షన్స్), సమీక్షకు లోబడి పొడిగించడమైనది.
ఫై నిర్దేశాల యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/2391 |