December 11, 2017
“భారతీయ ఆర్ధిక సంస్కరణలు: అసమగ్ర కార్యక్రమ పట్టిక పైన ప్రతిఫలనాలు” (‘ఇండియాస్
ఎకనామిక్ రిఫార్మ్స్:రిఫ్లెక్షన్స్ ఆన్ ది అనఫినిషెడ్ ఎజెండా’) అనే అంశం మీద
ప్రొఫెసర్ విజయ్ జోషి, ఎమెరిటస్ ఫెలో, మెర్టన్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ చే
పదిహేనవ ఎల్ కె ఝా స్మారకోపన్యాసం
భారతీయ రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలో పదిహేనవ ఎల్ కె ఝా స్మారకోపన్యాసం డిసెంబర్ 11, 2017 న ముంబైలో ఏర్పాటుచేయబడింది. ఈ ఉపన్యాసం ప్రొఫెసర్ విజయ్ జోషి, ఎమెరిటస్ ఫెలో, మెర్టన్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ చే ఇవ్వబడింది. గవర్నర్ డా. ఉర్జిత్ ఆర్. పటేల్ అతిధులకు స్వాగతము పలికారు మరియు 1990 లో భారతీయ రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఎల్ కె ఝా స్మారకోపన్యాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.
ప్రొఫెసర్ విజయ్ జోషి ఇండియాస్ లాంగ్ రోడ్:ది సెర్చ్ ఫర్ ప్రోస్పెరిటీ (పెంగ్విన్ ఇండియా, న్యూఢిల్లీ, 2016; మరియు OUP, న్యూయార్క్, 2017), భారతదేశం యొక్క ఆర్ధిక సంస్కరణలు, 1991-2001 (OUP, క్లారెండన్ ప్రెస్, ఆక్స్ఫర్డ్, 1996) మరియు ఇండియా: మాక్రోఎకనామిక్స్ అండ్ పొలిటికల్ ఎకానమీ, 1964 -1991 (ప్రపంచ బ్యాంకు మరియు OUP 1994) మొదలగు ఎన్నో పుస్తకాలను రచించారు. ప్రొఫెసర్ విజయ్ జోషి ఎప్పటికప్పుడు, వివిధ అధికారిక మరియు వ్యాపార స్థానాలను నిర్వహించారు; గవర్నర్, భారతీయ రిజర్వు బ్యాంకు కు ప్రత్యేక సలహాదారుడు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, మినిస్ట్రీ అఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా; డైరెక్టర్, J.P. మోర్గాన్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్; మరియు అనేక అంతర్జాతీయ సంస్థలకు సలహాదారుడు, ప్రపంచ బ్యాంకుతో సహా. మాక్రోఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ డెవెలప్మెంట్ ఎకనామిక్స్లలో ప్రాధమిక దృష్టి కేంద్రీకరిస్తూ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో బోధన మరియు పరిశోధన చేస్తున్నారు.
‘ఇండియాస్ ఎకనామిక్ రిఫార్మ్స్:రిఫ్లెక్షన్స్ ఆన్ ది అన్ఫినిషెడ్ ఎజెండా’ పేరుతో ప్రొఫెసర్ జోషి ప్రసంగం https://www.rbi.org.in లో అందుబాటులో ఉంది.
జోస్ జె కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/1588 |