December 20, 2017
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (ఎస్ సి బి లు) డిపాజిట్ల కూర్పు మరియు యాజమాన్య క్రమత - మార్చి 31, 2017
మార్చి 31, 2017 నాటి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (ఎస్ సి బి లు) డిపాజిట్ల కూర్పు మరియు యాజమాన్య క్రమతను భారతీయ రిజర్వు బ్యాంకు ఈ రోజు విడుదల చేసింది. బ్యాంకు శాఖలు/కార్యాలయాలు ఉన్న కేంద్రాల జనాభా వర్గీకరణ జాబితా, 2011 సం. గణాంకాల (సెన్సస్) ఆధారంగా తయారు చేయబడింది. ఫిబ్రవరి 2017 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 యొక్క రెండవ షెడ్యూల్లో జోడించబడిన రెండు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ ఎఫ్ బి లు) కూడా ఈ గణాంకాల్లో కలపబడ్డాయి.
ముఖ్యాంశాలు:
1. మొత్తం డిపాజిట్లలో గృహా సముదాయాల వాటా అన్ని రకాల డిపాజిట్లు మరియు అన్ని జనాభా సమూహాలలో / దేశీయ బ్యాంకుల సమూహాలలో పెరిగింది. ప్రైవేట్ కార్పొరేట్ రంగం డిపాజిట్లు, విదేశీ బ్యాంకుల డిపాజిట్లలో ప్రధాన భాగం.
2. గతంలో కాకుండా, వ్యక్తుల డిపాజిట్ల పెరుగుదల మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ పొదుపు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.
3. గృహ మరియు ప్రభుత్వ రంగాలు మొత్తం పెరుగుతున్న డిపాజిట్లకు దోహదం చేశాయి, అయితే ఆర్ధిక మరియు విదేశీ రంగాల డిపాజిట్లు తగ్గాయి.
4. విదేశీ బ్యాంకుల నుండి నాన్-రెసిడెంట్ డిపాజిట్లు సంవత్సర కాలంలో బయటకు పోవడం జరిగింది.
5. మహారాష్ట్ర (20.4 శాతం) బ్యాంకు డిపాజిట్లపై తన వాటాలో మొదటి స్థానంలో నిలిచింది, తర్వాత జాతీయ క్యాపిటల్ టెరిటరీ (ఎన్సిటి), ఢిల్లీ (10 శాతం).
6. 2016-17 సంవత్సరంలో పెరిగిన గృహా సముదాయాల డిపాజిట్లతో (12.7 శాతం) ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో, మహారాష్ట్ర (9.5 శాతం), పశ్చిమ బెంగాల్ (8.0 శాతం), గుజరాత్ (7.1 శాతం).
డిపాజిట్ ఖాతాలు, సంస్థాగత రంగాలు, జనాభా గ్రూపులు, బ్యాంకు గ్రూపులు వంటి విస్తృత అంశాలను విశ్లేషించే ఒక వివరణాత్మక వ్యాసం మార్చి 31, 2017 నాటి ఆర్బిఐ బుల్లెటిన్లో ప్రచురించబడుతుంది.
అనిరుద్ధ డి. జాధవ్
అసిస్టెంట్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/1693 |