February 8, 2018
తన పేరు మీద చలామణి చేస్తున్న నకిలీ వెబ్ సైట్ల గురించి
భారతీయ రిజర్వు బ్యాంకు హెచ్చరిక
భారతీయ రిజర్వు బ్యాంకు పేరుతొ నకిలీ వెబ్సైట్ URL www.indiareserveban.org కొంతమంది తెలియని వ్యక్తులతో సృష్టించబడిందని భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టికి వచ్చింది. నకిలీ వెబ్సైట్ యొక్క లేఅవుట్ అసలైన ఆర్బిఐ వెబ్సైట్ వలెనే ఉంటుంది. నకిలీ వెబ్సైట్ యొక్క హోమ్ పేజీలో "ఆన్లైన్ అకౌంట్ హోల్డర్లతో బ్యాంక్ వెరిఫికేషన్" కొరకు ఒక నియమంను కలిగి ఉంటుంది, బ్యాంకు వినియోగదారుల వ్యక్తిగత మరియు రహస్య బ్యాంకింగ్ వివరాలను సంపాదించాలనే మోసపూరిత ఉద్దేశ్యంతో, ఇది సృష్టించబడింది.
భారతదేశం యొక్క కేంద్ర బ్యాంకుగా, భారతీయ రిజర్వు బ్యాంకు వ్యక్తులకు ఎటువంటి ఖాతాలను కలిగి ఉండదు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్ వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారం ఎప్పటికీ అడగదు. కీలకమైన వ్యక్తిగత సమాచారం రాజీ పడటానికి ఫలితంగా వాటిని ఆర్థిక మరియు ఇతర నష్టాన్ని కలిగించడానికి ఇతరులు దుర్వినియోగం చేయవచ్చు అని, అటువంటి వెబ్ సైట్లకు ఆన్ లైన్ లో ప్రతిస్పందించే ప్రజలను, భారతీయ రిజర్వు బ్యాంకు హెచ్చరిస్తుంది..
ఇంకా www.rbi.org, www.rbi.in వంటి వెబ్సైట్ల ఉనికి గురించి కూడా ప్రజలను హెచ్చరించడం జరుగుతుంది. ఈ URL లు ఆర్బిఐ యొక్క వెబ్ సైట్ వలెనే కనిపిస్తాయి. అయితే, ఈ వెబ్ సైట్లకు భారతీయ రిజర్వు బ్యాంకుతో ఎటువంటి సంబంధం లేదు. అటువంటి సైట్లలో ఏదైనా సమాచారాన్ని అందించేటప్పుడు లేదా ఉపయోగించినప్పుడు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇవ్వడమైనది.
జోస్ జె. కట్టూర్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2017-2018/2166
సంబంధిత పత్రికా ప్రకటనలు / నోటిఫికేషన్లు |
ఏప్రిల్ 11, 2015 |
'ఆల్ బ్యాంక్ బాలెన్స్ ఎంక్వైరీ' అప్లికేషన్ గురించి ప్రజలను ఆర్బిఐ హెచ్చరించింది |
Jan 01, 2015 |
మల్టీ లెవల్ మార్కెటింగ్ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలను ఆర్బిఐ హెచ్చరించింది |
నవంబర్ 21, 2014 |
ఆర్బిఐ పేరుతో క్రెడిట్ కార్డు: తన పేరుతొ వస్తున్న సరికొత్త రకమైన మోసం గురించి ఆర్బిఐ మరోసారి హెచ్చరించింది |
మే 26, 2014 |
తన పేరుతొ వస్తున్న నకిలీ వెబ్సైట్ గురించి ఆర్బిఐ హెచ్చరించింది |
అక్టోబర్ 15, 2012 |
ఆర్బిఐ ప్రజలకు తన పేరుతొ పంపిస్తున్న ఫిషింగ్ మెయిల్స్ కు ప్రతిస్పందించవద్దని హెచ్చరించింది. |
సెప్టెంబర్ 14, 2012 |
మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతా వివరాల కోసం అడిగే ఇమెయిల్స్ కు స్పందించవద్దు: ప్రజలకు ఆర్బీఐ హెచ్చరిక |
మే 21, 2012 |
ఫిషింగ్గ్ మెయిల్స్ గురించి ఆర్బీఐ హెచ్చరిక |
ఫిబ్రవరి 06, 2012 |
కల్పిత/మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలను ఆర్బిఐ మరోసారి హెచ్చరించింది |
ఏప్రిల్ 5, 2011 |
మీ బ్యాంక్ ఖాతా వివరాలను ఆర్బిఐ ఎప్పటికీ అడగదు |
ఫిబ్రవరి 15, 2011 |
విదేశాల నుండి పెద్ద నిధులను పొందటానికి డబ్బు చెల్లించకండి: ఆర్బిఐ సలహా |
మే 28, 2010 |
మోసపూరిత డబ్బు బదిలీకి సంబంధించిన ప్రతిపాదనలకు మోసపోకండి: ఆర్బిఐ సలహా |
మే 26, 2010 |
లాటరీ, డబ్బు పంపిణీ పథకాలలో పాల్గొనడం, ఇతర కల్పిత ఆఫర్లు, మొదలైనవి |
జూలై 30, 2009 |
కల్పిత ఆఫర్లు/లాటరీలు గెలుపొందడం/చౌక ఫండ్ ఆఫర్స్: ఆర్బిఐ |
డిసెంబర్ 07, 2007 |
విదేశాల నుంచి చౌకైన నిధులను ఇస్తామనే ఆఫర్లపై ఆర్బిఐ హెచ్చరిక |
|