తేది: జులై 04, 2018
మోసపూరిత ఇ-మైళ్ళ (fictitious e-mails) గురించి, రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక
రిజర్వ్ బ్యాంక్ పేరుతో మోసగాళ్ళు, ప్రజలను వంచిస్తున్నారని రిజర్వ్ బ్యాంక్, ఇంతకు ముందునుండి ఎన్నోమార్లు చెబుతూవచ్చింది. ఈ దగాకోరులు, రిజర్వ్ బ్యాంక్ నకిలీ లెటర్ హెడ్లు వినియోగించి, రిజర్వ్ బ్యాంక్ అధికారులవలె నటిస్తూ అబద్ధపు ఉద్యోగావకాశాలు, లాటరీలో గెలుపొందారని, విదేశీ ముద్రా రుణాలు చవకగా ఇప్పిస్తామని మోసపూరిత ఇ-మైళ్ళు పంపుతూ ఉంటారు. అవి నమ్మి మోసపోయిన వారినుండి, ప్రాసెసింగ్ రుసుము / విదేశీ ముద్రా మారక రుసుము / ముందు చెల్లింపు, పేరిట సొమ్ము వసూలుచేస్తారు. 'ప్రజల అవగాహన కొరకు ప్రచారం' (Public Awareness Campaign) లో భాగంగా, రిజర్వ్ బ్యాంక్ ఎస్ ఎమ్ ఎస్‌లు, బయట ప్రకటనలు, లఘుచిత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
రిజర్వ్ బ్యాంక్, ఈ క్రింది విషయాలు మరొకమారు నొక్కి చెపుతున్నది:
- రిజర్వ్ బ్యాంకులో వ్యక్తుల ఖాతాలు ఉండవు.
- రిజర్వ్ బ్యాంక్ అధికారుల పేర్లు, మోసపూర్వక వినియోగంపై జాగ్రత్త వహించండి.
- రిజర్వ్ బ్యాంకు నుండి ఎవ్వరూ లాటరీవచ్చిందని / విదేశాలనుండి సొమ్ము వచ్చిందని, మీకు కాల్ చేయరు.
- రిజర్వ్ బ్యాంక్, మీరు లాటరీలో గెలిచినట్లు ఎప్పుడూ ఇ-మైల్స్ పంపించదు.
- రిజర్వ్ బ్యాంక్ ఎన్నడూ మీరు లాటరీలో గెలిచారనీ, విదేశాలనుండి మీకు సొమ్ము వచ్చిందని తెలుపుతూ, ఎస్ ఎమ్ ఎస్, ఉత్తరం, లేక ఇ-మైల్ పంపించదు.
- రిజర్వ్ బ్యాంకుయొక్క నిజమైన అధికారిక, వెబ్‌సైట్ https://www.rbi.org.in లేక https://rbi.org.in. అదేవిధంగా కనబడే 'రిజర్వ్ బ్యాంక్' (‘Reserve Bank’) 'అర్ బి ఐ' (‘RBI’) నకిలీ లోగోలు గల వెబ్‌సైట్లను చూసి మోసపోవద్దని, ప్రజలకు విజ్ఞప్తి.
- ఇటువంటి మోసాల గురించి పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు తక్షణం ఫిర్యాదుచేయండి.
రిజర్వ్ బ్యాంక్ పేరుతో అటువంటి సందేశాలు పంపే మోసగాళ్ళకు / మోసపూరిత సంస్థలకు జవాబు ఈయవద్దని, వారి వలలో పడవద్దని ప్రజలకు సూచన.
జోస్ జె కత్తూర్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన 2018-2019/34
| ఇతర సంబంధిత పత్రికా ప్రకటనలు / నోటిఫికేషన్లు |
| జూన్ 12, 2018 |
ఉద్యోగావకాశాలకు సంబంధించి ఆర్ బి ఐ వెబ్‌సైట్‌నుండి గాక ఇతర వెబ్‌సైటులనుండి వచ్చే సందేశాలను నమ్మవద్దని ఉద్యోగార్థులకు రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక |
| ఫిబ్రవరి 08, 2018 |
తమ వెబ్‌సైటును పోలిన పేర్లుగల నకిలీ వెబ్‌సైటుల గురించి రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక |
| ఏప్రిల్ 11, 2015 |
'అన్ని బ్యాంకుల ఖాతాలలో నిల్వ తెలుసుకోండి' అప్లికేషన్ ('All Bank Balance Enquiry' app.) గురించి హెచ్చరిక |
| జనవరి 01, 2015 |
బహుళ స్థాయి మార్కెటింగ్ కార్యకలాపాల (Multi-level Marketing Activities) గురించి రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక |
| నవంబర్ 21, 2014 |
ఆర్ బి ఐ పేరుతో క్రెడిట్ కార్డ్: సరికొత్తగా జరుగుతున్న మోసంగురించి మరొకసారి హెచ్చరిక |
| మే 26, 2014 |
తమ పేరుతో ఉన్న నకిలీ వెబ్‌సైట్ గురించి రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక |
| అక్టోబర్ 15, 2012 |
తమ పేరుతో వచ్చిన దగాకోరు మైల్స్‌కు (phishing mails) జవాబు ఈయవద్దని, ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక |
| సెప్టెంబర్ 14, 2012 |
మీ ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ఖాతా వివరాలు కోరుతున్న మైల్సుకు జవాబు ఇయ్యవద్దు: ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక |
| మే 21, 2012 |
దగాకోరు మైల్స్ గురించి రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక |
| ఫిబ్రవరి 06, 2012 |
మోసపూరిత సందేశాల (fictitious offers) గురించి మరొకసారి రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక |
| ఏప్రిల్ 05, 2011 |
రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ మీ బ్యాంక్ ఖాతా వివరాలు కోరదు |
| ఫిబ్రవరి 15, 2011 |
విదేశాలనుండి పెద్ద మొత్తంలో సొమ్ము పొందుటకు డబ్బు చెల్లించవద్దు: రిజర్వ్ బ్యాంక్ సలహా |
| మే 28, 2010 |
నగదు బదిలీ చేస్తామనే దగాకోరు సందేశాలకు మోసపోవద్దు: రిజర్వ్ బ్యాంక్ సలహా |
| మే 26, 2010 |
లాటరీలలో, మనీ సర్క్యులేషన్ స్కీములలో పాల్గొనుట, చవకగా సొమ్ము పొందుట మొదలైన వాటికొరకై దగాకోరు సందేశాలు |
| జులై 30, 2009 |
మోసపూరిత సందేశాలు / లాటరీలో గెలుపు / చవకగా సొమ్ము లభ్యత మొదలైన విషయాలలో జాగ్రత్త వహించండి: రిజర్వ్ బ్యాంక్ |
| డిసెంబర్ 07, 2007 |
విదేశాలనుండి చవకగా సొమ్ము పంపుతామనే దగాకోరు సందేశాలగురించి ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక |
|