తేదీ : జులై 09, 2018
జాగృతి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లి., హైదరాబాద్, తెలంగాణాపై, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జరిమానా విధించినది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 47(A) 1 (c) (సెక్షన్ 46 (4) తో కలిపి), క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జాగృతి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లి., హైదరాబాద్, తెలంగాణాపై, రూ. 25,000 (రూపాయిలు ఇరవై ఐదు వేలు) నగదు జరిమానా విధించినది. యు సి బి ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను / మార్గదర్శకాలను ఉల్లంఘించినందువల్ల, ఈ జరిమానా విధించడం జరిగింది.
రిజర్వ్ బ్యాంక్, జాగృతి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీ చేసినది. దీనికి బ్యాంక్, లిఖితపూర్వక జవాబు సమర్పించినది. ఈ విషయమై నిజానిజాలు, బ్యాంకుయొక్క జవాబు, ప్రత్యక్ష విన్నపాలు పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేననీ, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/80 |