తేది: జులై 19, 2018
రిజర్వ్ బ్యాంక్ త్వరలో క్రొత్త రూ. 100 విలువగల
బ్యాంక్ నోట్ జారీ చేయనుంది.
రిజర్వ్ బ్యాంక్ త్వరలో, మహాత్మా గాంధి (క్రొత్త) సిరీస్‌లో భారతీయ రిజర్వ్ బ్యాంక్, గవర్నర్, ఉర్జిత్ పటేల్ సంతకంగల రూ. 100 నోట్లు జారీ చేయనుంది. ఈ క్రొత్త నోటు వెనుక భాగంలో, మన పూర్వ సంస్కృతికి అద్దంపడుతూ, 'రాణి కా వావ్' చిత్రం కలిగిఉంటుంది. నోట్, ప్రధానంగా లావెండర్ రంగులో ఉంటుంది. నోట్ ముందు, వెనుక భాగాలలో, ఈరంగుతో కలిసిపోయి ఇతర ఆకృతులు, రేఖలు ఉంటాయి. విస్తీర్ణం 66 మి.మీ X 142 మి. మీ (66mm X 142 mm)
పూర్వపు సిరీస్‌లో జారీచేసిన అన్ని రూ. 100/- నోట్లు చెలామణిలో కొనసాగుతాయి.
సాధారణంగా, క్రొత్త నమూనాలో బ్యాంక్ నోట్లు జారీ చేసినప్పుడు, వాటి ముద్రణ మరియు బ్యాంకింగ్ మార్గాలద్వారా ప్రజలకు వాటి పంపిణీ, క్రమంగా పుంజుకొంటుంది.
మహాత్మా గాంధి (క్రొత్త) సిరీస్‌లో రూ. 100/- బ్యాంక్ నోట్‌మీద బొమ్మ, ఇతర ముఖ్య అంశాలు ఈ విధంగా ఉంటాయి:
i. నోట్ చిత్రము
ముందు భాగము
ii. ముఖ్య అంశాలు
ముందు వైపు
1. సీ త్రూ పట్టీలో నోట్ విలువ సంఖ్య 100
2. అంతర్లీనంగా నోట్ విలువ సంఖ్య 100
3. దేవనాగరి లిపిలో నోట్ విలువ १००
4. నోట్ మధ్యలో మహాత్మా గాంధీ చిత్రము
5. సూక్ష్మ అక్షరాలలో ‘RBI’, ‘भारत' 'India' మరియు '100'
6. కిటికీలుగా ఉండి, ‘भारत’, ’RBI’ అని ముద్రించిఉన్న, రంగు మారే సెక్యూరిటీ త్రెడ్; నోట్ వంచినప్పుడు, రంగు ఆకుపచ్చనుండి, నీలానికి మారుతుంది.
7. హామీ వాక్యము (Guarantee Clause), గవర్నర్ సంతకంతో వాగ్దాన వాక్యము (Promise Clause), మహాత్మా గాంధి చిత్రానికి కుడిప్రక్క ఆర్ బి ఐ చిహ్నము
8. కుడివైపున అశోక స్తంభం చిహ్నము
9. మహాత్మా గాంధీ చిత్రము మరియు ఎలక్ట్రోలైట్ 100 గల వాటర్‌మార్క్
10. కుడి ప్రక్క పైభాగంలో మరియు ఎడమప్రక్క క్రింది భాగంలో, ఆరోహణ క్రమంలో (ఎడమనుండి, కుడికి, సంఖ్యల పరిమాణం పెరుగుతూ) నంబర్ ప్యానెల్‌లో సంఖ్యలు
11. దృష్టిలోపం గలవారి సౌలభ్యం కొరకు, పైకిలేచి స్పర్శించగలిగినట్లు ముద్రించిన (intaglio), మహాత్మా గాంధి చిత్రం; అశోక స్తంభ చిహ్నం; త్రిభుజాకారపు గుర్తింపు చిహ్నం; సూక్ష్మ ముద్రణతో 100; కుడి, ఎడమప్రక్కల ఏటవాలుగా నాలుగు బ్లీడ్ లైన్లు
వెనుక వైపు
12. ఎడమప్రక్క, నోట్ ముద్రించిన సంవత్సరం
13. 'స్వఛ్చ్ భారత్' చిహ్నం (logo) మరియు స్లోగన్
14. భాషల పట్టీ
15. 'రాణి కి వావ్' చిత్రం
16. దేవనాగరి లిపిలో నోటు విలువ '१००'
జోస్ జె కత్తూర్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/174 |