తేదీ: ఆగస్ట్ 06, 2018
2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) వారి నమోదు పత్రాలను (Certificates of Registration)
రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి అప్పగించినవి,
ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs), వారికి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందువల్ల, సెక్షన్ 45 - I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలతో, వారి నమోదు పత్రాలను రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.
| క్రమ సం. |
కంపెనీ పేరు |
ఆఫీస్ చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు ఆదేశం తేదీ |
| 1 |
M/s కొంగు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. |
కొంగు మెట్రిక్యులేషన్ స్కూల్ కాంపస్, పరామతీ మైన్ రోడ్, వెల్లూర్, సేలమ్-638 182, తమిల్‌నాడు |
07.00219 |
ఏప్రిల్ 20, 1998 |
జులై 04, 2018 |
| 2 |
M/s జీవన్ లి. |
బజాజ్ భవన్, 2 వ అంతస్తు, జమన్‌లాల్ బజాజ్ మార్గ్, 226, నారిమన్ పాయింట్, ముంబై-400 021 |
13.00648 |
ఏప్రిల్ 07, 1998 |
జూన్ 21, 2018 |
ఈ కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/324 |