ఆగస్టు 09, 2018
భారతీయ రిజర్వు బ్యాంకుకి రెండు ఎన్.బి.ఎఫ్.సిల ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ
ఈ క్రింది ఎన్.బి.ఎఫ్.సిలు తమకు మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భారతీయ రిజర్వు బ్యాంకుకు సమర్పించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది రెండు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.
| క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
కార్యాలయ చిరునామా |
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య |
జారీ చేయబడిన తేదీ |
రద్దు చేయబడిన తేదీ |
| 1 |
జి పి మాస్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఇంతకుముందు లెవెల్ ఫీల్డ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా వున్నది) |
4-5-37/1, ఫ్లాట్ సంఖ్య 204, సాయి హోమ్స్, ఫస్ట్ లేన్, విద్యానగర్, గుంటూరు-522 007, ఆంధ్ర ప్రదేశ్ |
B-09.00202 |
జనవరి 15, 2009 |
జూన్ 29, 2018 |
| 2 |
వెల్ షైన్ ఇన్వెస్ట్మెంట్స్ మరియు ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ |
B-101, హరిహర రెసిడెన్సీ, 20, మన్నారపురం మెయిన్ రోడ్, తిరుచురాపల్లి-620 020 |
B-07.00261 |
నవంబర్ 25, 2004 |
జులై 11, 2018 |
అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క వ్యాపారాన్ని చేయకూడదు.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/359 |