సెప్టెంబర్ 03, 2018
రూపీ సహకార బ్యాంక్ లిమిటెడ్., పూణే ఫై జారీ చేసిన నిర్దేశాలను (డైరెక్షన్స్),
భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది
ఆగష్టు 28, 2018 నాటి ఆదేశం DCBR.CO.AID/D-11/12.22.218/2018-19 ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు, రూపీ సహకార బ్యాంక్ లిమిటెడ్., పూణే ఫై జారీ చేసిన నిర్దేశాలను (డైరెక్షన్స్) సెప్టెంబర్ 01, 2018 నుండి నవంబర్ 30, 2018 వరకు తిరిగి మూడునెలల వ్యవధి కొరకు సమీక్షాధికారాలతో పొడిగించింది. నిర్దేశాలు వాస్తవానికి ఫిబ్రవరి 22, 2013 నుండి ఆగస్టు 21, 2013 వరకు విధించబడ్డాయి మరియు ఎనిమిది సందర్భాల్లో ప్రతి ఆరు నెలల వ్యవధిలో మూడు మరియు ప్రతి మూడు నెలల వ్యవధిలో ఐదు సందర్భాలలో పొడిగింపబడ్డాయి. చివరిగా మూడు నెలల వ్యవధి కొరకు జూన్ 01, 2018 నుండి ఆగస్టు 31, 2018 వరకు పొడిగింపబడ్డాయి.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, నిర్దేశాలు విధించబడ్డాయి. జారీ చేసిన నిర్దేశం యొక్క ప్రతి, బ్యాంక్ ప్రాంగణంలో ఆసక్తిగల సభ్యుల పరిశీలన కోసం ప్రదర్శించబడినది.
జారీ చేయబడిన ఫై నిర్దేశాలను, తప్పనిసరిగా పాటించవలసిన మార్గదర్శకాలను/ఆదేశాలను బ్యాంకు ఉల్లంఘించినందుకు మాత్రమే తప్ప, భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసే చర్యగా భావించరాదు. ఆర్ధిక స్థితి మెరుగుపడేంతవరకు, పరిమితులకు లోబడి బ్యాంకు తన బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. భారతీయ రిజర్వు బ్యాంకు ఈ నిర్దేశాలలో మార్పులను పరిస్థితుల మీద ఆధారపడి సవరించవచ్చును.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/533
|