యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియాఫై, భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు |
సెప్టెంబర్ 07, 2018
యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియాఫై, భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు
ఫ్రాడ్-వర్గీకరణ మరియు రిపోర్టింగ్ కోసం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) మాస్టర్ సర్క్యులర్ ద్వారా జారీ చేసిన నిబంధనలు / ఆదేశాలు పాటించనందుకు, యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియాఫై, ఆగష్టు 30, 2018 న ₹ 10 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4)(i) తో కలిపి సెక్షన్ 47A(1)(c) లో భారతీయ రిజర్వు బ్యాంకు కు ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకొని, ఒక ఖాతాలో జరిగిన మోసపూరిత కార్యకలాపాలాలను గుర్తించి మరియు నివేదిక సమర్పించడంలో జరిగిన జాప్యానికి, జరీమానా విధించడమైనది.
అనిరుద్ధ డి జాదవ్
అసిస్టెంట్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/585
| |