సెప్టెంబర్ 12, 2018
ఇండియన్ మేర్కన్టైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, లక్నో, ఉత్తరప్రదేశ్ ఫై జారీ చేసిన నిర్దేశాలను (డైరెక్షన్స్),
భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది
ఇండియన్ మేర్కన్టైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, లక్నో, ఉత్తరప్రదేశ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు విధించిన నిర్దేశాల (డైరెక్షన్స్) అమలు మరో ఆరు నెలల వ్యవధి కొరకు సెప్టెంబర్ 12, 2018 నుండి మార్చ్ 11, 2019 వరకు, సమీక్షకు లోబడి పొడిగించడమైనది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 35A, సబ్ సెక్షన్ (1), క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, సదరు బ్యాంకు జూన్ 04, 2014 నాటి ఆదేశం ద్వారా జూన్ 12, 2014 నుండి నిర్దేశాల క్రింద ఉంచబడింది.
పైన విధించిన నిర్దేశం తగిన మార్పులతో, కాలానుసారంగా జులై 30, 2014, డిసెంబరు 08, 2014, జూన్ 02, 2015, సెప్టెంబరు 07, 2015, అక్టోబరు 19, 2015, డిసెంబరు 07, 2015, మార్చి 04, 2016, సెప్టెంబరు 02, 2016, నవంబర్ 25, 2016, మార్చి 09, 2017, సెప్టెంబరు 01, 2017 మరియు మార్చి 06, 2018 నాటి ఆర్.బి.ఐ ఆదేశాల ద్వారా పొడిగించడమైనది. చివరగా ఇచ్చిన ఆదేశం ద్వారా సెప్టెంబరు 11, 2018 వరకు పొడిగించబడిన నిర్దేశాలు, మరో ఆరు నెలల పాటు అంటే సెప్టెంబరు 12, 2018 నుండి మార్చి 11, 2019 వరకు సెప్టెంబరు 07, 2018 న జారీ చేసిన ఆదేశం ద్వారా, సమీక్షకు లోబడి పొడిగింపబడింది. సెప్టెంబరు 07, 2018 న జారీ చేసిన పొడిగింపబడిన నిర్దేశం యొక్క ప్రతి, బ్యాంకు యొక్క ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.
మార్పులతో జారీ చేయబడిన ఫై నిర్దేశాలను, బ్యాంక్ యొక్క ఆర్ధిక స్థితిలో మెరుగుదలను లేదా క్షీణతకు కొలమానంగా తీసుకోకూడదు. పరిస్థితుల మీద ఆధారపడి, భారతీయ రిజర్వు బ్యాంకు ఈ నిర్దేశాలలో మార్పులను సవరించవచ్చును.
అనిరుద్ధ డి. జాధవ్
అసిస్టెంట్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/601
|