సెప్టెంబర్ 18, 2019
నేషనల్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, బహ్రయిచ్ - జరిమానా విధింపు
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, పైన ఉదహరించిన చట్టం యొక్క సెక్షన్ 27 క్రింద రిటర్న్స్ సమర్పణ లో నిరంతరంగా విఫలమైనందుకు, నేషనల్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, బహ్రయిచ్ ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 2,00,000 (రెండు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది.
భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను మరియు బ్యాంక్ ప్రత్యుత్తరం పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/646 |