అక్టోబర్ 03, 2018
శ్రీ గణేష్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, నాశిక్, మహారాష్ట్ర కు జారీ చేసిన
ఆర్బీఐ ఆదేశాలు డిసెంబర్ 29, 2018 వరకు తిరిగి పొడిగింపు
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆదేశం నం. డిసిబిఆర్.సీఓ/ఏఐడి/డి-13/12.22.435/2018-19 తేదీ సెప్టెంబర్ 27, 2018 ద్వారా) నాశిక్ లోని శ్రీ గణేష్ సహకారి బ్యాంక్ లిమిటెడ్ కు అంతకుముందు జారీ చేసిన ఆదేశాలను మరో మూడు నెలలపాటు పొడిగించినది. ఈ ఆదేశాలు ప్రస్తుతం సమీక్షకు లోబడి, డిసెంబర్ 29, 2018 వ తేదీ వరకు అమలులో ఉంటాయి.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 A (1) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం, తమకు దఖలుపరచబడిన ఆధికారాలతో రిజర్వు బ్యాంకు ఈ ఆదేశాలను విధించింది. ఆదేశాల నకలును ఆసక్తిగల ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ పరిసరాలలో ఉంచడం జరుగుతుంది.
రిజర్వు బ్యాంకు చే జారీ చేయబడిన ఆదేశాలను బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు అయిందనిగా భావించరాదు. బ్యాంక్ తన బ్యాంకింగ్ బిజినెస్ ను నిబంధనలతో, వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడేoతవరకు, నిర్వహిస్తారు. పరిస్థితులను బట్టి రిజర్వు బ్యాంకు ఈ ఆదేశాలలో మార్పు చేసే అవకాశాన్నిపరిశీలించవచ్చును.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజరు
ప్రెస్ రిలీజ్: 2017-2018/779. |