| ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ ఫై ఆర్.బి.ఐ. ఆదేశాలు కొనసాగింపు |
అక్టోబర్ 05, 2018
ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ ఫై ఆర్.బి.ఐ. ఆదేశాలు కొనసాగింపు
భారతీయ రిజర్వు బ్యాంకు - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) రెడ్ విత్ సెక్షన్ 56 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం, తమకు దఖలుపరచబడిన ఆధికారాలతో ది వైష్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ కు ఆగస్ట్ 28, 2015 తేదీన జారీ చేసిన డైరెక్టివ్ ఎప్పటికప్పుడు సవరించబడుతూ, అక్టోబర్ 08, 2018 వరకు వర్తింపు కొనసాగి, సమీక్షకు లోబడి మరో నాలుగు నెలల పాటు అంటే అక్టోబర్ 09, 2018 నుండి ఫిబ్రవరి 08, 2019 వ తేదీ వరకు వర్తిస్తుందని ఇందుమూలంగా నిర్దేశిస్తున్నది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
ప్రెస్ రిలీజ్: 2018-2019/802 |
|