అక్టోబర్ 11, 2018
హర్దోయి జిల్లా సహకారి బ్యాంక్ లిమిటెడ్, హర్దోయి, ఉత్తరప్రదేశ్ పై జరిమానా విధింపు.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47A(1) (c) రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు దఖలుపరచబడిన అధికారములతో హర్దోయి జిల్లా సహకారి బ్యాంక్ లిమిటెడ్, హర్దోయి, ఉత్తరప్రదేశ్ పై, సదరు చట్టం లోని సెక్షన్ 19 క్రింద ఇతర కో-ఆపరేటివ్ సొసైటీలలో షేర్ల హోల్డింగ్ పరిమితిపై ఆర్బిఐ సూచనలను / మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు మరియు సదరు చట్టం లోని సెక్షన్ 31 క్రింద, ఆడిటర్ రిపోర్ట్ తో అకౌంట్లు మరియు బ్యాలెన్స్ షీట్ ను ప్రచురించకపోవడం / దాఖలు చేయకపోడం తో, ₹ 1,00,000/- (ఒక లక్ష రూపాయలు) నగదు జరిమానా విధించింది.
2. భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిoది. ఈ సందర్భంగా కేసు సంబంధిత నిజానిజాలను పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చినది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/857 |