తేదీ: 04/02/2019
పశుపోషణ, మత్స్య పరిశ్రమల నిర్వహణ మూలధనంకొరకు
(వర్కింగ్ కేపిటల్) కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం
బ్యాంకింగ్ రంగంనుండి, అవసర సమయంలో సులభమైన, సరళమైన రీతిలో, స్వల్పకాలిక పంట రుణాలు అందించడం, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంయొక్క ఉద్దేశం. పశుపోషణ, మత్స్య పరిశ్రమ వ్యవసాయదారులకు కూడా ఈ ప్రయోజనం అందించడంకోసం, కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం కల్పించాలన్న నిర్ణయాన్ని, భారత ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ విషయాన్ని, ఇందులో పాలుపంచుకొనేవారందరితో చర్చించి, పశుపోషణ, మత్స్య పరిశ్రమలలో ఉన్న వ్యవసాయదారులందరికీ వారి నిర్వహణ మూలధనం కొరకు, కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం పొడిగించాలని నిర్ణయించబడింది.
అనిరుద్ధ డి జాధవ్
అసిస్టెంట్ మానేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/1839
|