తేదీ: 08/02/2019
ది వైశ్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంకు లి., న్యూ ఢిల్లీకి
జారీచేసిన నిర్దేశాల కాలపరిమితి పొడిగింపు
రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్ 35 A, సబ్‌సెక్షన్ (1) (సెక్షన్ 56 తో కలిపి), తమకు దఖలు పరచిన అధికారాలతో, ఆగస్ట్ 28, 2015 తేదీన ది వైశ్ కో-ఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ లి., న్యూఢిల్లీకి జారీచేయబడి ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారిగా ఫిబ్రవరి 08, 2019 వరకు పొడిగించబడిన నిర్దేశాలు, మరొక ఆరు నెలలు అనగా, ఫిబ్రవరి 09, 2019 నుండి ఆగస్ట్ 08, 2019 వరకు, సమీక్షకు లోబడి, పొడిగించబడినవని ఇందుమూలముగా ఆదేశిస్తున్నది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/1891 |