డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌తో, డిబిఎస్ బ్యాంక్ లిమిటెడ్ సమ్మేళనాన్ని (అమల్గమేషన్) ఆర్‌బిఐ ఆమోదించింది |
ఫిబ్రవరి 28, 2019
డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌తో, డిబిఎస్ బ్యాంక్ లిమిటెడ్ సమ్మేళనాన్ని (అమల్గమేషన్) ఆర్‌బిఐ ఆమోదించింది
భారతదేశంలో బ్యాంకింగ్ వ్యాపారాన్ని పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ (WOS) ద్వారా కొనసాగించడానికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 లోని సెక్షన్ 22 (1) క్రింద భారతీయ రిజర్వు బ్యాంకు లైసెన్స్ పొందిన డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌తో, డిబిఎస్ బ్యాంక్ లిమిటెడ్, ఇండియా యొక్క మొత్తం సంస్థ సమ్మేళనం పథకాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు మంజూరు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 లోని సెక్షన్ 44(A) లోని ఉప-సెక్షన్ (4) లోని అధికారాలను వినియోగించుకొని, ఈ పథకం మంజూరు చేయబడింది.
ఈ పథకం మార్చి 01, 2019 నుండి అమల్లోకి వస్తుంది. భారతదేశంలో డిబిఎస్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క అన్ని శాఖలు, మార్చి 01, 2019 నుండి డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ యొక్క శాఖలుగా పనిచేస్తాయి.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2064
|
|