మార్చ్ 14, 2019
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) -
వసంత్ దాదా నగరి సహకారి బ్యాంకు లిమిటెడ్, ఉస్మానాబాద్, మహారాష్ట్ర ఫై నిర్దేశాలు
ప్రజా ప్రయోజనం కోసం, వసంత్ దాదా నగరి సహకారి బ్యాంకు లిమిటెడ్, ఉస్మానాబాద్, మహారాష్ట్ర ఫై, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సొసైటీలకు వర్తించేది), సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35ఎ క్రింద నవంబరు 13, 2017 పని వేళలు ముగిసే సమయం నుండి, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాలను విధించింది. అట్టి నిర్దేశాలను, భారతీయ రిజర్వు బ్యాంకు మార్చ్ 14, 2019 నుండి జూన్ 13, 2019 వరకు మరో 3 నెలల వ్యవధి కొరకు పొడిగించింది. ఈ నిర్దేశాలు డిపాజిట్ల ఉపసంహరణ/స్వీకరణల పై కొన్ని నిబంధనలను/పరిమితులను స్పష్టంగా నిర్ణయించాయి. వివరణాత్మక నిర్దేశాలు బ్యాంక్ యొక్క ప్రాంగణంలో ఆసక్తిగల సభ్యుల పరిశీలన కోసం ప్రదర్శించబడ్డాయి. పరిస్థితుల మీద ఆధారపడి, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాల మార్పులను పరిగణించవచ్చు. ఈ చర్య తప్పనిసరిగా పాటించవలసిన మార్గదర్శకాలను/ఆదేశాలను బ్యాంకు ఉల్లంఘించినందుకు మాత్రమే తప్ప, భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసే చర్యగా భావించరాదు. ఆర్ధిక స్థితి మెరుగుపడేంతవరకు, పరిమితులకు లోబడి బ్యాంకు తన బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తుంది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2190 |