మార్చి 25, 2019
ది యు.పి సివిల్ సెక్రటేరియట్ ప్రైమరీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ , లక్నో
(ఉత్తరప్రదేశ్) కు జారీ చేసిన ఆదేశాల చెల్లుబాటును పొడిగించిన ఆర్బీఐ .
భారతీయ రిజర్వు బ్యాంక్ లక్నో లోని ది యు.పి సివిల్ సెక్రటేరియట్ ప్రైమరీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ , లక్నోకు జారీ చేసిన ఆదేశాలను ఆరు నెలలపాటు మార్చి 26, 2019 నుండి సెప్టెంబర్ 25, 2019 వరకు సమీక్షకు లోబడి పొడిగించినది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సబ్-సెక్షన్ (1) సెక్షన్ 35 A (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధన ప్రకారం, ఈ బ్యాంక్ ను సెప్టెంబర్ 19, 2018 డైరెక్టివ్ ననుసరించి సెప్టెంబర్ 25, 2018 నుండి ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది.
మార్చి 25, 2019 వరకు జారీ చేసిన ఆదేశం యొక్క చెల్లుబాటును ఆరు నెలల కాలానికి మార్చి 26, 2019 నుండి సెప్టెంబర్ 25, 2019 వరకు తమ మార్చి 19, 2019 నాటి డైరెక్టివ్ ద్వారా పొడిగించారు. ప్రజల పరిశీలన కోసం మార్చి 19, 2019 డైరెక్టివ్ యొక్క నకలు బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడుతుంది.
రిజర్వు బ్యాంక్ చే జారీ చేయబడిన డైరెక్టివ్ మార్పు ననుసరించి పైన పేర్కొన్న బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని గాని క్షీణించినదని గాని భావింపరాదు. పరిస్థితులను బట్టి రిజర్వు బ్యాంక్ తమ ఆదేశాలలో మార్పు చేసే అవకాశాన్నిపరిశీలించవచ్చును.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజరు
పత్రికా ప్రకటన సంఖ్య : 2017-2018/2274 |