మార్చి 29, 2019
శ్రీ గణేష్ సహకరి బ్యాంక్ లిమిటెడ్, నాశిక్, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ
చట్టం, 1949 (ఏఏసీయస్), సెక్షన్ 35ఏ, సబ్-సెక్షన్ 2 క్రింద సర్వ-సంఘటిత ఉత్తర్వుల ఉపసంహరణ
ప్రజాహితం కోసం భారతీయ రిజర్వు బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసీయస్) సెక్షన్ 35ఏ, సబ్-సెక్షన్ (1) తో పాటు సెక్షన్ 56, ద్వారా తమకు సంక్రమించిన అధికారాలననుసరించి , ఏప్రిల్ 01, 2013 తేదీ వ్యాపారవేళల ముగింపు నుండి శ్రీ గణేష్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, నాసిక్, మహారాష్ట్రకు నిర్దేశాలను జారీ చేసింది. ఇప్పుడు భారతీయ రిజర్వు బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్ 35ఏ, సబ్-సెక్షన్ (2), ద్వారా తమకు సంక్రమించిన అధికారాలననుసరించి శ్రీ గణేష్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, నాసిక్, మహారాష్ట్రకు జారీచేసిన సర్వ-సంఘటిత (ఆల్-ఇంక్లుసివ్) నిర్దేశాలను మార్చి 26, 2019 తేదీ వ్యాపార వేళల ముగింపునుండి ఉపసంహరించుకున్నది.
ఇఁకమీఁదట ఈ బ్యాంక్ యథావిధి తమ వ్యాపార కార్య కలాపాలను కొనసాగిస్తుంది.
అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్
ప్రెస్ రిలీజ్ : 2018-2019/2316 |