ఏప్రిల్ 06, 2019
లక్ష్మీ విలాస్ బ్యాంక్ మరియు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విలీన ప్రకటన గురించి
లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ) మరియు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్) తమ బోర్డుల ఆమోదంతో ఏప్రిల్ 5, 2019 తేదీ న వొక విలీన ప్రకటనను చేసినట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంది. ఎల్‌వీబీ బోర్డులో ఆర్‌బీఐ నామినేట్ చేసిన ఇద్దరు నామినీ డైరెక్టర్లు ఉండటం చేత ఈ విలీనo ఆర్‌బీఐ పరోక్ష ఆమోదం పొందినట్లేనని కూడా కొన్ని ప్రసార మాధ్యమాలు పేర్కొన్నాయని రిపోర్ట్ చేయబడింది. ఇప్పటివరకు ఈ విలీనానికి ఆర్‌బీఐ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేయడమైనది. ఎల్‌వీబీ బోర్డులో ఆర్‌బీఐ చే నియమించబడిన అదనపు డైరెక్టర్లు ఉండటం మూలాన ఈ విలీన ప్రతిపాదనకు ఆర్‌బీఐ నుంచి ఎటువంటి ఆమోదం పొందినట్లుగా కాదని కూడా స్పష్టం చేయడమైనది. అంతేగాకుండా, అదనపు డైరెక్టర్లు బోర్డ్ సమావేశం లో ఈ ప్రతిపాదనపై తమ అభిప్రాయమేమిలేదని స్పష్టంగా పేర్కొన్నారు. విలీనం కాబోయే సంస్థల నుంచి ప్రతిపాదనలు వస్తే ఆర్బీఐ ప్రస్తుత నియంత్రణ మార్గదర్శకాలు / ఆదేశాల ప్రకారం అవి పరిశీలించబడతాయి.
యోగేష్ దయాళ్ చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన : 2018-2019/2390
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….