ఏప్రిల్ 23, 2019
మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹ 200 డినామినేషన్ బ్యాంక్ నోట్ల జారీ
భారతీయ రిజర్వు బ్యాంక్ మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹ 200 డినామినేషన్ బ్యాంక్ నోట్లను త్వరలో జారీ చేస్తుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలా మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్‌లోని ₹ 200 బ్యాంక్ నోట్ల మాదిరిగానే ఉంటుంది. గతంలో రిజర్వు బ్యాంక్ జారీచేసిన మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్‌లోని అన్ని ₹ 200 డినామినేషన్ బ్యాంక్ నోట్లు, చట్టబద్ధంగా చెలామణీలో కొనసాగుతాయి.
యోగేష్ దయాళ్ చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2513
1024 x 768 LjiÇÁÌÁWùxtsQƒ±s»][, H.B.5 ª«sVLji¸R…VV µy¬sNTP „sVLiÀÁƒ«s ªyÉÓÁÍÜ BLiNS ¿RÁNRPägS NRPƒ«sxms²R…V»R½VLiµj….