ఏప్రిల్ 26, 2019
ఆర్‌బీఐ మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ లో ₹ 20 బ్యాంకు నోట్ ను విడుదల చేసింది
భారతీయ రిజర్వు బ్యాంకు మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్, భారతీయ రిజర్వు బ్యాంకు సంతకం తోకూడిన ₹ 20 విలువ (డినామినేషన్) గల బ్యాంకు నోట్లను త్వరలో జారీ చేయనుంది. కొత్త డినామినేషన్ నోట్ల పృష్ఠ భాగం (రివర్స్-వెనుక వైపు) లో ఎల్లోరా గుహల మూలాంశ ముద్రణ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని తలపిస్తుంది. నోటు ప్రధానంగా ఆకుపచ్చటి పసుపు రంగు లో ఉంటుంది. ఈ నోటుకు రెండు వైపులా అంటే ముందు మరియు వెనుకభాగాలలో ఈ రంగుతో సమగ్రంగా కలిసిపోయి ఇతర డిజైన్లు, జ్యామేట్రిక్ ప్యాట్రన్లు (రేఖలు) ఉంటాయి.
మునుపటి సిరీస్‌లో రిజర్వు బ్యాంకు జారీ చేసిన అన్ని ₹ 20/- నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.
మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ లో ₹ 20 బ్యాంకు నోటు నమూనా మరియు ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
i) నమూనా ముఖ భాగము (ముందు వైపు)
వెనుక వైపు (వెనుకవైపు)
ii) ముఖ్య లక్షణాలు
ముఖభాగం (ముందు వైపు)
1. పారదర్శక పట్టిక లో మూల్యవర్గపు అంకె 20
2. దేవనాగరి లిపి లోమూల్యవర్గపు అంకె 20
3. నోటు మధ్యలో మహాత్మాగాంధీ యొక్క చిత్రం
4. సూక్ష్మ (మైక్రో) లెటర్స్ ‘RBI’, ‘भारत', ‘INDIA' మరియు '20'.
5. ‘भारत' మరియు ‘RBI’ తో సెక్యూరిటీ థ్రెడ్
6. గ్యారెంటీ నిబంధన, వాగ్ధాన నిబంధనతో గవర్నర్ సంతకం, మహాత్మాగాంధీ చిత్రం కు కుడి వైపున ఆర్‌బీఐ చిహ్నం
7. కుడి వైపున అశోక స్తంభం చిహ్నం
8. మహాత్మాగాంధీ చిత్రం మరియు ఎలక్ట్రోటైప్ (20) వాటర్ మార్క్స్
9. పైన ఎడమ వైపున మరియు కింద కుడి వైపున, చిన్న ఆకారం గల అంకెలనుంచి పెద్ద ఆకారానికి పెరిగే అంకెల వరుస
వెనుక భాగం (వెనుక వైపు)
10. ఎడం వైపున నోట్ ని ముద్రించిన సంవత్సరం
11. స్లోగన్ తో సహా స్వచ్ఛ భారత్ లోగో
12. భాషల పట్టిక
13. ఎల్లోరా గుహల చిత్రం
14. దేవనాగరి లిపిలో మూల్యవర్గపు అంకె 20.
బ్యాంకు నోట్ పరిమాణం 63 mm x 129 mm గా ఉంటుంది.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2555 |