తేదీ: 03/05/2019
వెస్టెర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్విసెస్ ఐ ఎన్ సి.,మరియు మనీగ్రామ్
పేమెంట్ సిస్టమ్స్ ఐ ఎన్ సి. లపై రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
నియంత్రణా మార్గదర్శకాలు పాటించని కారణంగా, రిజర్వ్ బ్యాంక్, వారి ఏప్రిల్ 20, 2018 ఆదేశాల ద్వారా, ఈ క్రింద పేర్కొన్న సంస్థలపై, సూచించిన విధంగా నగదు జరిమానాలు విధించినది:
వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌కార్పొరేటెడ్, యు ఎస్ ఏ రూ. 29,66,959/-
మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్ ఇన్‌కార్పొరేటెడ్, యు ఎస్ ఏ రూ. 10,11,653/-
పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ ఏక్ట్, 2007, ద్వారా తమకు దఖలుపరచబడిన అధికారాలతో, సెక్షన్ 31 అనుసారంగా, రిజర్వ్ బ్యాంక్ ఈజరిమానాలు విధించింది.
శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2592 |