| విలువ ముందే జమచేయబడ్డ చెల్లింపు సాధనాలు (ప్రీ-పైడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్, పి పి ఐలు) జారీచేస్తున్న ఐదు సంస్థలకు రిజర్వ్ బ్యాంక్, నగదు జరిమానా విధించినది |
తేదీ: 03/05/2019
విలువ ముందే జమచేయబడ్డ చెల్లింపు సాధనాలు (ప్రీ-పైడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్, పి పి ఐలు) జారీచేస్తున్న ఐదు సంస్థలకు రిజర్వ్ బ్యాంక్, నగదు జరిమానా విధించినది
నియంత్రణా మార్గదర్శకాలు పాటించని కారణంగా, సెక్షన్ 30 చెల్లింపులు మరియు పరిష్కారాల చట్టం, 2007 (పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ ఏక్ట్, 2007) ద్వారా తమకు దఖలుపరచబడ్డ అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ఐదు పి పి ఐ జారీ సంస్థలపై, ఈక్రింద సూచించిన విధంగా నగదు జరిమానా విధించినది.
| క్రమ సం. |
పి పి ఐ జారీ సంస్థ పేరు |
వివరణాత్మక ఆదేశం తేదీ |
జరిమానా మొత్తం
(రూ. లక్షలలో) |
| 1 |
మై మొబైల్స్ పేమెంట్స్ లి. |
22-10-2018 |
100 |
| 2 |
ఫోన్‌పే ప్రై. లి. |
14-02-2019 |
100 |
| 3 |
వై-క్యాష్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రై. లి. |
22-02-2019 |
5 |
| 4 |
వోడాఫోన్ ఎమ్-పైసా లి. |
06-03-2019 |
305 |
| 5 |
జి ఐ టెక్నాలజీ ప్రై. లి. |
26-03-2019 |
100 |
శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2593 | |