తేదీ: 13/05/2019
గోమ్‌తీ నగరియా సహకారి బ్యాంక్ లి., జాన్‌పూర్ (ఉత్తర్ ప్రదేశ్) –
రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన నిర్దేశాల ఉపసంహరణ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ఇండియా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A క్రింద, గోమ్‌తీ నగరియా సహకారి బ్యాంక్ లి., జాన్‌పూర్‌కు (ఉత్తర్ ప్రదేశ్) జులై 03, 2017 తేదీన నిర్దేశాలు జారీ చేసినది. ఈ నిర్దేశాలు ఎప్పటికప్పుడు, మార్చబడుతూ, పొడిగించబడుతూ వచ్చాయి. చివరిసారి అక్టోబర్ 30, 2018 తేదీన జారీచేసిన ఆదేశాలద్వారా, మే 10, 2019 వరకు పొడిగించబడ్డాయి.
రిజర్వ్ బ్యాంక్, ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్దేశాలు ఉపసంహరించుట అవసరమని భావించి, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్ 35 A, సబ్-సెక్షన్ (2) ద్వారా తమకు దఖలుపరచబడిన అధికారాలతో, గోమ్‌తీ నగరియా సహకారి బ్యాంక్ లి., జాన్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్‌కు జారీచేయబడి (ఎప్పటికప్పుడు మార్పు చేయబడిన) నిర్దేశాలు, ఇందుమూలముగా ఉపసంహరించినది.
ఈ విషయమై జారీచేసిన ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకొరకు, గోమ్‌తీ నగరియా సహకారి బ్యాంక్ లి., ఆవరణలో ప్రదర్శించబడినది. ఇప్పటినుండి బ్యాంకు యథావిధిగా బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది.
శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2661 |