తేదీ: 13/05/2019
నైనితాల్ బ్యాంక్ లి. పై, రిజర్వ్ బ్యాంక్‌చే జరిమానా విధింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నైనితాల్ బ్యాంక్ లి. (బ్యాంక్) పై 10 మిలియన్ రూపాయిల నగదు జరిమానా విధించింది. నిరర్థక ఆస్తుల గుర్తింపులో సాంకేతిక విధానాలను అమలుపరచమని ప్రత్యేకంగా జారీచేసిన ఆదేశాల అమలులో బ్యాంక్ విఫలమైనందువల్ల ఈ జరిమానా విధించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన మార్గదర్శకాలు అతిక్రమించినందువల్ల, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 47A(1)(c) [సెక్షన్ 46 (4) తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈజరిమానా విధించడమైనది. నిబంధనల అమలులో వైఫల్యం కారణంగా ఈ చర్య తీసుకోబడిందేతప్ప. బ్యాంకు, ఖాతాదారులతో జరిపిన లావాదేవీలు / చేసుకున్న ఒప్పందాల చెల్లుబడిమీద, ఇది తీర్మానము కాదు.
నేపథ్యం:
మార్చ్ 31, 2016 తేదీనగల బ్యాంక్ ఆర్థిక స్థితిపై జరిపిన తనిఖీ నివేదిక ఆధారంగా, నిరర్థక ఆస్తుల గుర్తింపు ప్రక్రియ ఒక నిర్దిష్ట సమయంలోగా, పూర్తిగా ఆటోమట్ చేయవల్సిందిగా బ్యాంకును ఆదేశించడం జరిగింది. మార్చ్ 31, 2017 తేదీనగల ఆర్థిక స్థితిపై జరిపిన తనిఖీ నివేదికలోకూడా, ఈ ఆదేశాలు తిరిగి జారీచేయడం జరిగింది. ఆమలుచేయడానికి గడువు పొడిగించబడింది. అయితే, బ్యాంక్ ఈ ఆదేశాలు పాటించడంలో విఫలమయింది. ఈ వైఫల్యం కారణంగా వారిపై ఎందుకు చర్య తీసుకోరాదో తెలపమని బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీచేయబడింది. బ్యాంకు ఇచ్చిన జవాబు, వారి ప్రత్యక్ష వినతులు పరిశీలించిన పిమ్మట, వారిపై జరిమానా విధించవలెనని నిశ్చయించడం జరిగింది.
శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2663 |