తేది: 17/05/2019
పద్మశ్రీ డా. విఠ్ఠల్‌రావ్ విఖే పాటిల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., నాశిక్, మహారాష్ట్ర -
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),
సెక్షన్ 35A క్రింద నిర్దేశాల పొడిగింపు
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సబ్-సెక్షన్ 1, సెక్షన్ 35A (సెక్షన్ 56 తో కలిపి), తమకు దఖలుపరచిన అధికారాలతో, పద్మశ్రీ డా. విఠ్ఠల్‌రావ్ విఖే పాటిల్ కోఆపరేటివ్ బ్యాంక్ లి., నాశిక్, మహారాష్ట్రకు మే 19, 2018 పనివేళల ముగింపు సమయం నుండి నిర్దేశాలు జారీచేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ నిర్దేశాలు మరొక నాలుగు నెలలపాటు – మే 19, 2019 నుండి సెప్టెంబర్ 17, 2019 వరకు - పొడిగించింది. వీటిని సమీక్షించవచ్చు. ఈ నిర్దేశాల ప్రతి, ప్రజల సమాచారంకొరకు, పద్మశ్రీ డా. విఠ్ఠల్‌రావ్ విఖే పాటిల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శింపబడినది. పరిస్థితులకు అనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు. పై నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన, బ్యాంకుయొక్క లైసెన్స్ రద్దు చేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక స్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది.
శైలజా సింగ్
డిప్యూటీ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2705 |