మహాత్మా గాంధీ (క్రొత్త) సిరీస్‌లో, గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ సంతకంతో రూ. 10/- విలువగల బ్యాంక్ నోట్ల జారీ |
తేదీ: 20/05/2019
మహాత్మా గాంధీ (క్రొత్త) సిరీస్‌లో, గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ సంతకంతో రూ. 10/- విలువగల బ్యాంక్ నోట్ల జారీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహాత్మా గాంధీ (క్రొత్త) సిరీస్‌లో, గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ సంతకంగల రూ. 10/- విలువగల బ్యాంక్ నోట్లు, త్వరలో జారీ చేయనుంది. ఈ నోట్ల నమూనా అన్ని విధాలుగా మహాత్మా గాంధీ (క్రొత్త) సిరీస్‌లోని రూ 10/- నోట్లను పోలి ఉంటుంది. ఇంతకు మునుపు రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన అన్ని రూ. 10/- విలువగల బ్యాంక్ నోట్లు, చట్టరీత్యా చలామణిలో కొనసాగుతాయి.
యోగేశ్ దయాల్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2717 | |