| బంగారపు నిల్వలపై రిజర్వ్ బ్యాంక్ వివరణ |
తేదీ: 03/05/2019
బంగారపు నిల్వలపై రిజర్వ్ బ్యాంక్ వివరణ
రిజర్వ్ బ్యాంక్ తమ బంగారపు నిల్వలలో కొంత భాగాన్ని 2014 లో విదేశాలకు తరలించిందని పత్రికలలో, సామాజిక మాధ్యమాలలో ప్రచురించబడిన వార్తలు మా దృష్టికి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా కేంద్రీయ బ్యాంకులు తమ బంగారపు నిల్వలను, ఇతర దేశాల కేంద్రీయ బ్యాంకులలో (ఉదా: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్) భద్రతకొరకు దాచి ఉంచడం పరిపాటి. పైగా, రిజర్వ్ బ్యాంక్ 2014 సంవత్సరంలోగాని, ఆ తరువాతగాని ఏ బంగారము ఇతరదేశాలకు బదిలీచేయలేదని తెలియపరుస్తున్నాము. అందువల్ల, పైన తెలిపిన వార్తలు పూర్తిగా అవాస్తవం.
యోగేష్ దయాల్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2600 |
|