తేదీ: 31/01/2019
సత్వర దిద్దుబాటు చర్యల ప్రక్రియ
(Prompt Corrective Action Framework)
ప్రస్తుతం, 'సత్వర దిద్దుబాటు చర్యల ప్రక్రియ' (PCA) క్రింద ఉన్న జాతీయ బ్యాంకుల పనితీరు సమీక్షించబడింది. కొన్ని బ్యాంకులు ప్రకటించిన డిసెంబర్ 2018 త్రైమాసికపు, ఫలితాలనుబట్టి చూస్తే, ‘రిటర్న్ ఆఫ్ అసెట్స్’ విషయంలోతప్ప, సత్వర దిద్దుబాటు చర్యలను ఉల్లంఘించలేదు. అయితే, ‘రిటర్న్ ఆఫ్ అసెట్స్’, ప్రతికూలంగా కొనసాగుతున్నా, అది మూలధన సంపూర్ణత సూచీలో (Capital Adequacy Indicator) చూపబడుతోంది. ఈ బ్యాంకులు, కనీస నియంత్రిత మూలధన (minimum regulatory capital); నికర నిరర్ధక ఆస్తుల; మరియు ‘లెవరేజ్ రేషియోలకు’ సంబంధించిన నియమాలు ఎల్లప్పుడూ పాటిస్తూ ఉంటామని, లిఖితపూర్వక హామీనిచ్చాయి. ఇంతేగాక, ఈ నిబంధనలు ఎల్లప్పుడూ పాటించుటకు వారు చేసిన వ్యవస్థీకృత, విధానాత్మక సంస్కరణల గురించి రిజర్వ్ బ్యాంకుకు తెలియచేసాయి. పైగా, ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంకువారీ కేటాయింపులు చేసే సమయంలో, ఈ బ్యాంకులయొక్క మూలధన అవసరాలు, లెక్కింపులోకి తీసుకొంటామని, ప్రభుత్వం హామీ ఇచ్చింది.
పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని, నియంత్రణా నియమాలు, (కేపిటల్ కన్జర్వేషన్ బఫర్‌తో సహా) అమలుపరుస్తూ, నిరర్థక ఆస్తులు 6% కన్న తక్కువగా కలిగిఉన్న, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలను, కొన్ని నిబంధనలు విధించి, పర్యవేక్షిస్తూ, 'సత్వర దిద్దుబాటు చర్యల ప్రక్రియ' పరిధినుండి తొలగించాలని నిర్ణయించబడినది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, 7.15% నిరర్థక ఆస్తులు కలిగి ఉన్నా (మూడవ త్రైమాసిక, ప్రకటించిన ఫలితాలు), ప్రభుత్వం మూలధన సహాయం కల్పించింది గనుక, నిరర్థక ఆస్తులు, బ్యాంక్ 6% నికి తగ్గించిందిగనుక, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌పై సత్వర దిద్దుబాటు చర్యల ప్రక్రియ క్రింద విధించిన ఆంక్షలు తీసివేయాలని నిశ్చయించడం జరిగింది. అయితే, బ్యాంక్, కొన్ని నిబంధనలకు, పర్యవేక్షణకు లోబడి ఉంటుంది.
వివిధ పరామితుల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్, ఈ బ్యాంకుల పనితీరు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది
జోస్ జె కత్తూర్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/1807
|