తేదీ: 14/06/2019
వసంత్‌దాదా నగరి సహకారి బ్యాంక్ లి., ఒస్మానాబాద్, మహారాష్ట్ర –
నిర్దేశాల కాలపరిమితి పొడిగింపు
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A, సబ్-సెక్షన్(1) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్, ప్రజాక్షేమం దృష్ట్యా, వసంత్‌దాదా నగరి సహకారి బ్యాంక్ లి., ఒస్మానాబాద్, మహరాష్ట్రకు, నవంబర్ 13, 2017, పనివేళల ముగింపునుండి, నిర్దేశాలు జారీచేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈనిర్దేశాల కాల పరిమితి, మరొక మూడు నెలల పాటు, అనగా జూన్ 14, 2019 నుండి సెప్టెంబర్ 13, 2019 వరకు, పొడిగించినది. ఈనిర్దేశాలద్వారా, కొన్ని నిబంధనలు, డిపాజిట్ల ఉపసంహరణ (withdrawal) / స్వీకారంపై (acceptance) కొన్ని పరిమితులు విధించబడ్డాయి. ఈ నిర్దేశాల పూర్తి వివరాలు, ప్రజల సమాచారంకోసం, వసంత్ దాదా నగరి సహకారి బ్యాంక్, ఆవరణలో ప్రదర్శించబడ్డాయి. పరిస్థితులనుబట్టి, రిజర్వ్ బ్యాంక్, ఈ ఆదేశాలలో మార్పులు చేయవచ్చు. నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన రిజర్వ్ బ్యాంక్, వారి లైసెన్సును రద్దుచేసినట్లు భావించరాదు. బ్యాంకు, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలకు కట్టుబడి, బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగించవచ్చు.
యోగేశ్ దయాల్
చీఫ్ జనరల్ మానేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/2953 |