తేది: 27/06/2019
భారతీయ రిజర్వు బ్యాంకుకి నాలుగు బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల
(ఎన్.బి.ఎఫ్.సిలు) ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ
ఈ క్రింది ఎన్.బి.ఎఫ్.సిలు, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను సమర్పించాయి. తదనుసారముగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేసింది.
క్రమ సంఖ్య |
కంపెనీ పేరు |
కార్యాలయం చిరునామా |
సిఓఆర్ సంఖ్య |
జారీ చేయబడిన తేదీ |
రద్దు చేయబడిన తేదీ |
1 |
KRC ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం ఇది KR చోక్సి ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ లిమిటెడ్ గా పిలువబడుతుంది) |
1102, స్టాక్ ఎక్స్ఛేంజ్ టవర్, దలాల్ స్ట్రీట్, ఫోర్ట్, ముంబై –
400 021 |
బి.13.00023 |
ఫిబ్రవరి 18, 1998 |
మే 06, 2019 |
2 |
తన్వి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ |
6 బి, బెంటిక్ స్ట్రీట్,
1 వ అంతస్తు, గది సంఖ్య 11 ఎ, కోల్‌కతా -700 001 |
05.03133 |
జూన్ 14, 1999 |
మే 14, 2019 |
3 |
కారవాన్ కమర్షియల్ కంపెనీ లిమిటెడ్ |
6 లియోన్స్ రేంజ్, పి.ఎస్. హరే స్ట్రీట్, కోల్‌కతా -700 001 |
05.01434 |
ఏప్రిల్ 06, 1998 |
మే 16, 2019 |
4 |
ట్వింకిల్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ (ఢిల్లీ) లిమిటెడ్ |
1/5-బి, అసఫ్ అలీ రోడ్, న్యూ ఢిల్లీ –
110 002 |
14.00792 |
మే 16, 1998 |
మే 17, 2019 |
తదనుసారముగా, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2018-2019/3063 |