తేది: 02/07/2019
భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా నాలుగు బ్యాంకుల ఫై జరిమానా విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా ‘మీ వినియోగదారుని తెలుసుకోండి’ (KYC), యాంటీ మనీ లాండరింగ్ (AML) ప్రమాణాలు మరియు వాడుక ఖాతా ప్రాంభించడం పై జారీ చేసిన కొన్ని నిబంధనల అనుపాలన లోపం కొరకు భారతీయ రిజర్వు బ్యాంకు, జూన్ 25, 2019 నాటి ఆదేశం ప్రకారం, క్రింద సూచించిన నాలుగు బ్యాంకులపై ఆర్ధిక జరిమానా విధించింది.
క్రమ సంఖ్య |
బ్యాంకు పేరు |
జరిమానా (₹ మిలియన్లలో) |
1 |
అలహాబాద్ బ్యాంకు |
5 |
2 |
కార్పొరేషన్ బ్యాంకు |
2.5 |
3 |
పంజాబ్ నేషనల్ బ్యాంకు |
5 |
4 |
యూకో బ్యాంకు |
5 |
ఈ జరిమానాలు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47A(1)(c) తో కలిపి, సెక్షన్ 46(4)(i) లోని అధికారాలను వినియోగించుకొని, పైన ఉదహరించిన భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను/ఆదేశాలను పాటించడంలో వైఫల్యానికి విధించడం జరిగింది. ఈ చర్య, అనుపాలనా లోపం కొరకు మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద అభిప్రాయ వ్యక్తీకరణ కాదు.
నేపథ్యం
ఫిర్యాదు ఆధారంగా, పైన పేర్కొన్న బ్యాంకులలో నాలుగు సంస్థలు తెరిచిన వాడుక ఖాతాల పరిశీలనలో ‘మీ వినియోగదారుని తెలుసుకోండి’ (KYC), యాంటీ మనీ లాండరింగ్ (AML) ప్రమాణాలు మరియు వాడుక ఖాతా ప్రారంభించడం పై ఆర్బిఐ జారీ చేసిన కొన్నినిబంధనలను పాటించడంలో బ్యాంకులు విఫలమయ్యాయని గమనించబడింది. పరిశీలన ద్వారా ప్రాప్తించిన సమాచారం/దస్తావేజుల ఆధారంగా, విధించిన షరతులను పాటించడంలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరిమానాఎందుకు విధించకూడదు అని బ్యాంకులకు నోటీసులు జారీ చేయడం జరిగింది.
బ్యాంకులు ఇచ్చిన లిఖిత సమాధానం, వ్యక్తిగత విచారణలో మౌఖిక నివేదనలను పరిగణించిన అనంతరం, ఆర్.బి.ఐ ఆదేశాలు పాటించడంలో బ్యాంకులు విఫలమయ్యాయన్న ఆరోపణలు వాస్తవమని నమ్ముతూ, ఆర్ధిక జరిమానా విధించాలని నిర్ధారణకు రావడం జరిగింది.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/26 |