తేది: 09/07/2019
శ్రీ భారతి నగర సహకార బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ –
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్
35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్) - నిర్దేశాల కాలపరిమితి పొడిగింపు
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంతృప్తి చెందినదై, శ్రీ భారతి నగర సహకార బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాలు విధించింది. ఈ నిర్దేశాలు జనవరి 02, 2019 నుండి జులై 02, 2019 వరకు సమీక్షకు లోబడి, అమలులో ఉంటాయి.
శ్రీ భారతి నగర సహకార బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ ఫై విధించిన నిర్దేశం కాల పరిమితిని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంతృప్తి చెందినదై, భారతీయ రిజర్వు బ్యాంకు మరో ఆరు నెలలపాటు అంటే జులై 03, 2019 నుండి జనవరి 02, 2020 వరకు సమీక్షకు లోబడి, పొడిగించాలని నిర్ణయించింది. నిర్దేశం క్రింద వున్న ఇతర నియమ, నిబంధనలలో ఎటువంటి మార్పు ఉండదు.
నిర్దేశాల యొక్క నకలు బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.
యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్
పత్రికా ప్రకటన: 2019-2020/93 |